సహజంగా స్ట్రయిట్ సినిమాల్లోని పాటలకు సూపర్ డూపర్ వ్యూస్ లభిస్తుంటాయి. అలానే డాన్స్ నంబర్స్ కూ సోషల్ మీడియాలో వీక్షకుల ఆదరణ లభిస్తుంటుంది. ఇక స్టార్ హీరోల పాటల సంగతి చెప్పక్కర్లేదు. వారి అభిమానులే ఆ పాటలకు మిలియన్ వ్యూస్ రావడానికి కారణమౌతారు. కానీ ఓ తెలుగు డబ్బింగ్ సినిమా పాట పది కోట్ల మంది వీక్షకులను పొందిందంటే అబ్బురమే. ఆ ఫీట్ ను సాధించిన గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్.
Read Also : లేడీ సూపర్ స్టార్ కొత్త బిజినెస్
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’గా విడుదలైంది. అందులోని ‘కాటుక కనులే’ గీతాన్ని రాశారు భాస్కరభట్ల. ఇది డాన్స్ నంబర్ కాదు. అలా అని సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ కూడా కాలేదు. ఓటీటీలో విడుదలై, వీక్షకుల ఆదరణను మాత్రం పొందింది. అలాంటి ఓ సినిమాలోని ఈ పాట ఇంతగా ఆదరణ పొందడానికి ప్రధాన కారణంగా భాస్కరభట్ల రాసిన గీతమే. అందులోని అర్థవంతమైన పదాలు తెలుగు సాహితీకారులనే కాదు… సినీ సంగీత అభిమానులను, సాధారణ శ్రోతలను సైతం ఆకట్టుకున్నాయి. దాంతో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ అందుకున్న తొలి తెలుగు డబ్బింగ్ పాటగా ‘కాటుక కనులే’ నిలిచింది. దీనికి జీవీ ప్రకాశ్ స్వరాలు అందించగా, దీక్షిత గానం చేసింది. విశేషం ఏమంటే… ఈ సినిమా తమిళ పాట కేవలం 63 మిలియన్స్ వ్యూస్ పొందగా, తెలుగు డబ్బింగ్ పాట దానిని క్రాస్ చేసింది. మరో ముఖ్యమైన అంశం ఏమంటే… ఇప్పుడీ ‘సూరారై పోట్రు’ సినిమాను సూర్య హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. ఎయిర్ డెక్కన్ అధినేత జీ.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోవడం విశేషం.
