NTV Telugu Site icon

Karthi : కే. విశ్వనాథ్, బాలచందర్, కమల్ హాసన్, దాసరి నారాయణరావుకి థాంక్స్ చెప్పాలి

Karthi

Karthi

హీరో కార్తీ, అరవింద్ స్వామి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకోని యునిమాస్ బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Also Read : Official : మరోసారి ‘దళపతి విజయ్’ సరసన పూజ హెగ్డే.. హిట్టు దక్కేనా..?

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో హీరో కార్తీ మాట్లాడుతూ “ఇది సక్సెస్ మీట్ లా లేదు ఫ్యామిలీ ఫంక్షన్ లా వుంది. మీరంతా ఎంతో ప్రేమతో అప్రిషియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  ‘సత్యం సుందరం’కు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంత ప్రేమని ఇస్తున్న అందరికీ థాంక్ యూ. మీరు చూపించిన లవ్ కి చాలా ఎమోషనల్ అయ్యాను. ముందుగా కే విశ్వనాథ్, బాలచందర్, కమల్ హాసన్, దాసరి గారు లాంటి గొప్పవారికి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి సినిమా మనికి చిన్నప్పుడే చూపించారు. ఈ కైండ్ అఫ్ సినిమాని మనలోపల పెట్టారు.  కొత్త సినిమాలు చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకాని ఈ సినిమా మరోసారి రుజువుచేసింది.  ఇలాంటి ఎమోషన్స్ జీవితంలో మిస్ అవుతున్నాయని, మళ్ళీ ఆ ఎమోషన్ ని తీసుకొచ్చారని ఆడియన్స్ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారికి థాంక్ యూ. 96లో ఎలా ప్రేమించాలో చెప్పారు. ఇందులో అన్ కండీషనల్ లవ్ అంటే చూపించారు. అన్నయ్య ఈ కథ విన్న వెంటనే నువ్వు చేయాలని చెప్పారు.  ఈ సినిమా నా కోసం కాదు మంచి సినిమా కోసం చూడాలని ప్రేక్షకులని కోరుకుంటున్నాను.  ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్” అని అన్నారు.

Show comments