Site icon NTV Telugu

Tollywood Producers: మునగచెట్టు ఎక్కించి వాళ్ళపై నిందలు ఎందుకు?

Tollywood

Tollywood

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కార్తీ కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు తెరమీదకు వచ్చాయి. బాబీ డైరెక్షన్‌లో రూపొంద పోతున్న సినిమాలో కార్తీక్ కూడా నటిస్తున్నట్లు దాదాపుగా కన్ఫామ్ అయినట్లే. అధికారికంగా ప్రకటించలేదు కానీ, టాలీవుడ్ వర్గాల్లో అందరికీ ఈ విషయం తెలుసు. అయితే, ఇక్కడే ఒక కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. అదేంటంటే, ఈ సినిమా కోసం కార్తీకి ఏకంగా 23 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. వాస్తవానికి, ఇప్పటివరకు కార్తీ తమిళంలో అత్యధికంగా తీసుకున్నది 15 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ, ఈ సినిమా కోసం ఆయనను నటింపజేసేందుకు ఏకంగా 23 కోట్లు ఆఫర్ చేయడంతో, ఆయన ఆ ఆఫర్ ఒప్పుకున్నారు. సినిమా ఫైనల్ అయింది.

Also Read :NBK 111 : బాలయ్య సరసన నయనతార ఫిక్స్.. మరో హిట్ లోడింగ్

అయితే, ఇక్కడే ఈ చర్చ మొదలైంది. ఎందుకంటే, తమిళంలో స్టార్ హీరోగా ఉన్న కార్తీకి అక్కడ నిర్మాతలు కూడా ఇవ్వని అమౌంట్‌కి అత్యధికంగా ఇంకా కలిపి ఆఫర్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది. కార్తీ చేయాల్సిన పాత్రను తెలుగులో మరే హీరో చేయలేను అన్నారా? లేక, డైరెక్ట్‌గా కార్తీని అప్రోచ్ అయ్యి, ఆయన తప్ప ఇంకెవరూ నటించకూడదు అని ఆయనకు ఆఫర్ చేశారా? నిజానికి ధనుష్ విషయంలో కూడా గతంలో ఇదే జరిగింది. ఆయనకు తమిళంలో 35 నుంచి 40 కోట్ల రూపాయలు మాత్రమే ఆఫర్ చేసేవాళ్లు. కానీ, మన నిర్మాతలు 45 నుంచి 65 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసి సినిమాలు ఫైనల్ చేసుకోవచ్చారు.

“అదేంటి, తెలుగు హీరోలను వదిలేసి తమిళ్ హీరోలను పట్టుకురావడం ఎందుకు?” అని అడిగితే, “తెలుగు హీరోల డేట్స్ ఖాళీ లేవు కదా, అందుకే తమిళ హీరోలను తీసుకొచ్చాం” అని అప్పట్లో చెప్పుకొచ్చారు. “మరి వాళ్లకు ఇచ్చే రెమ్యూనరేషన్‌కి మించి ఎందుకు ఇచ్చి తీసుకొచ్చారు?” అంటే, “వాళ్లతో మనం రెగ్యులర్‌గా సినిమాలు చేయము కదా, వాళ్ళు మనల్ని నమ్మాలంటే అత్యధిక రెమ్యూనరేషన్ ఇస్తే తప్ప వాళ్ళు మన దగ్గరకు వచ్చి సినిమాలు చేయరు” అని చెప్పుకొచ్చారు. అలా ఒకసారి రెమ్యూనరేషన్ పెరిగిన తర్వాత, మళ్లీ తెలుగులో వాళ్ళు తక్కువకి చేస్తారా అంటే కచ్చితంగా చేయరు.

Also Read :Vamshi Paidipally : ఖాన్స్ వద్దన్న కథకి పవన్ గ్రీన్ సిగ్నల్.. టెన్షన్లో ఫాన్స్

ఒకరకంగా, నిర్మాతలు తమకు తెలిసి తెలియక హీరోలను మునగ చెట్టు ఎక్కించి, వాళ్ళ వల్ల సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయని మళ్లీ వాళ్ళ మీదే నిందలు వేస్తున్నారు. దాదాపు తెలుగు హీరోల పరిస్థితి కూడా ఇంతే. తెలుగు హీరోల డేట్స్ ఎలా అయినా సంపాదించాలి అనే ఉద్దేశంతో, తమకు నోటికొచ్చిన రేట్లు ఆఫర్ చేసి నిర్మాతలు హీరోలను బ్లాక్ చేస్తున్నారు. తద్వారా ఆ హీరో మార్కెట్‌తో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ పెరిగిపోతోంది. ఆ తర్వాత సినిమా వర్కౌట్ కాలేదని మళ్లీ బయటికి వచ్చి నిర్మాతలే పెదవి విరుస్తున్నారు. కాబట్టి, హీరోల డేట్స్, రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు లూస్ అవ్వకుండా, కాస్త గట్టిగా ఉంటే తప్ప ఈ విషయాన్ని కంట్రోల్ చేయలేరేమో అనిపిస్తోంది

Exit mobile version