NTV Telugu Site icon

Karmasthalam : పాన్ ఇండియా ‘కర్మ స్థలం’.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ లాంచ్

Karmasthalam

Karmasthalam

అర్చన కీలక పాత్రలో మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘కర్మ స్థలం. రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన ఈ సినిమామొ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్‌లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్‌లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ చిత్రానికి ఏ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్‌ను వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.

Manchu Family: మెజిస్ట్రేట్ ముందే తిట్టుకున్న మంచు మనోజ్ & మోహన్ బాబు!

ఇంత మంచి సబ్జెక్ట్‌ని, కర్మ స్థలం వంటి అద్భుతమైన టైటిల్‌తో సినిమాను తెరకెక్కించిన రాకీ గారికి థాంక్స్. కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నాను. కానీ కథను అద్భుతంగా నెరేట్ చేశారు. కథను చాలా మంది అద్భుతంగా చెబుతారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడుతుంటారు. కానీ నిర్మాత శ్రీనివాస్ గారి సహకారంతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిది. ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. ఆ రోజు జరిగిన షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది. ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. పోస్టర్ ఎంత ప్రభావం చూపిస్తోందో.. సినిమా కూడా అంతే ప్రభావం చూపించబోతోంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.