ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ సాధించింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి మాట్లాడుతూ “మా కర్మణ్యే వాధికారస్తే అక్టోబర్ 31 న థియేటర్స్ లో విడుదల అయింది. మంచి రివ్యూస్ వచ్చాయి. చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడు మా చిత్రం సన్ నెక్స్ట్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పక చూడండి. థియేటర్ లో చూడని వారు సన్ నెక్స్ట్ ఓ టి టి లో చూసి మా సినిమా ని ఎంజాయ్ చేయండి” అని తెలిపారు.
