Site icon NTV Telugu

Karmanye Vadhikaraste: సెప్టెంబర్ 19న కర్మణ్యే వాధికారస్తే

Karmanye Vadhikaraste

Karmanye Vadhikaraste

బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఇటీవల మధుర ఆడియో ద్వారా విడుదల అయినా చిత్ర ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 19 న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ “‘కర్మణ్యే వాధికారస్తే’ అనేది భగవద్గీత లోని ఒక పదం. దాని అర్థం “పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు”. టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథ కి సరి సాటిగా బ్రహ్మాజీ, శత్రు మరియు ‘మాస్టర్’ మహేంద్రన్ వారి నటన తో చిత్రానికి మరింత ప్రాణం పోశారు. ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్, స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. మా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19 న విడుదలకు సిద్ధం గా ఉంది. అని పేర్కొన్నారు.

Exit mobile version