కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కాంతార’ సినిమా పాన్-ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కన్నడలోనే కాకుండా, తెలుగు స్టేట్స్‌లో కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మేకర్స్ ప్రీక్వెల్‌ని తో రాబోతున్నారు. ఈ ప్రీక్వెల్ అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానుంది. అయితే అసలు హాట్ టాపిక్ ఏమిటంటే..
Also Read : Anirudh Ravichander: అనిరుధ్ హుకుమ్ కచేరీకి.. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
ఈ సినిమా కోసం మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్‌ని ఆశిస్తున్నారట. ఏకంగా 100 కోట్ల మేర డీల్ గా మేకర్స్ క్విట్ చేస్తున్నారట. ఇది మాత్రం ఒక షాకింగ్ మొత్తం అని చెప్పాలి. పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ దానికి ప్రీక్వెల్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు వరకు పాన్ ఇండియా ఆడియెన్స్‌ని ఎగ్జైట్ చేసే సాలిడ్ కంటెంట్, ట్రైలర్, ప్రోమోస్ కూడా రాలేదు. అయినప్పటికీ, మేకర్స్ భారీ బిజినెస్ ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సినిమాలు బిజినెస్ విషయంలో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘కాంతార ప్రీక్వెల్’ కోసం ఇంత భారీ మొత్తం పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. మరి ఈ రూ.100 కోట్ల డీల్ నిజంగా జరుగుతుందా? లేక ఇది కేవలం మార్కెటింగ్ హైప్ మాత్రమేనా? అన్నది చూడాలి.
