Site icon NTV Telugu

Kannappa : ‘కన్నప్ప’ కి ఫైనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడంటే?

Kannappa Pre Release Event

Kannappa Pre Release Event

మంచు విష్ణు హీరోగా, ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’. జూన్ 27న విడుదల కాబోతున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో పలువురు స్టార్‌ అందరు భాగం అవుతున్నారు. కానీ ప్రేక్షకులను థియేటర్లకు రపించేది మాత్రం ప్రభాస్‌ ఒక్కరే అన్నది ఇండస్ట్రీలో స్పష్టంగా వినిపిస్తున్న మాట. ఈ విషయాన్ని విష్ణు కూడా బాగా తెలుసుకున్నారు. అందుకే సినిమా ట్రైలర్‌లో ప్రభాస్‌కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చేలా ప్లాన్ చేశారు.

Also Read : Aamir Khan: ఇచ్చిన మాట ప్రకారం.. రూ.120 కోట్ల డీల్ వదులుకున్న బాలీవుడ్ హీరో..

ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర సుమారు అరగంట పాటు ఉండనుందని, ఇది తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే సినిమా అవుతుంద‌ని ప్రభాస్ కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబందించిన వార్త వైరల్ అవుతుంది. కాగా జూన్ 21న హైదరాబాద్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ  ప్రీ-రిలీజ్ వేడుక  ఘనంగా జరగనుం‌ది. ఇందులో నటించిన స్టార్ అందరితో పాటు మిగతా టీమ్ మొత్తం హాజరు కానుంది. కానీ ప్రభాస్ హాజరవుతాడా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ప్రభాస్‌ కూడా హాజరైతే ఈ ఈవెంట్‌కి మరింత జోష్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రభాస్‌ను ఆహ్వానించాడట. మరి చూదాం డార్లింగ్ వస్తారో రారో..

Exit mobile version