వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన జె.ఎస్.ఎస్. వర్ధన్ ఈ సినిమాకు సంభాషణలు రాసి, దర్శకత్వం వహించారు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ సినిమాలో అంకిత్ కొయ్య మరియు నీలఖి పాత్ర హీరో, హీరోయిన్‌లుగా నటించారు. ఇప్పటివరకు ‘బ్యూటీ’ నుంచి విడుదలైన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అందమైన పాటను విడుదల చేశారు. ‘కన్నమ్మ కన్నమ్మ’ అంటూ సాగే ఈ గీతాన్ని సనారే రచించగా, ఆదిత్య ఆర్కే మరియు లక్ష్మీ మేఘన ఆలపించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ పాట హృదయాన్ని తడమగల సుందరమైన బాణీతో శ్రోతలను ఆకట్టుకుంటోంది.
పాటలోని సాహిత్యం, చిత్రీకరణ, హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ‘కన్నమ్మ’ పాట శ్రవణానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.‘ఆయ్’, ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తన నటనా ప్రతిభను చాటుకున్న అంకిత్ కొయ్య, ‘బ్యూటీ’లో సోలో హీరోగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీ సాయి కుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎస్‌బి ఉద్ధవ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది విడుదల కానున్న ఆసక్తికర చిత్రాల్లో ‘బ్యూటీ’ ఒకటిగా నిలవనుంది. బి.ఎస్. రావు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
