కోవిడ్ -19 కేసులతో పాటు దేశంలో ఆక్సిజన్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎక్కువ చెట్లను నాటాలని ప్రజలను కోరుతూ సోమవారం ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆక్సిజన్‌ను ఉపయోగించే వ్యక్తులు గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని ఆమె అన్నారు. “అందరూ ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. టన్నులు టన్నులు ఆక్సిజన్ సిలిండర్లను పొందుతున్నారు. మనం పర్యావరణం నుండి ఫోర్స్ ఫుల్ గా తీసుకుంటున్న ఆక్సిజన్‌కు ఎలాంటి పరిహారం చెల్లిస్తున్నాము ? మన తప్పుల వల్ల ఎదురయ్యే విపత్తుల నుండి మనం ఏమీ నేర్చుకోవట్లేదు”అని కంగనా ట్విట్టర్లో రాశారు.
“మానవులకు మరింత ఎక్కువ ఆక్సిజన్ అవసరమని ప్రకటించడంతో పాటు ప్రభుత్వాలు ప్రకృతికి కూడా ఉపశమనం ప్రకటించాలి. ఈ ఆక్సిజన్‌ను ఉపయోగిస్తున్న వ్యక్తులు గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. మనం ఇంకా ఎంతకాలం భూమికి ఏమీ తిరిగి ఇవ్వకుండా ప్రకృతికి పట్టిన దుర్భరమైన తెగుళ్ళుగా ఉండబోతున్నాం? భూమి నుండి సూక్ష్మజీవులు, కీటకాలు అదృశ్యమైతే అది భూమి తల్లి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ మానవులు అదృశ్యమైతే భూమి అభివృద్ధి చెందుతుంది. భూమి తల్లి ప్రేమికులు కాకపోతే మీరు భూమిపై ఉండడం అనవసరం అని గుర్తుంచుకోండి” అంటూ ప్లాంట్ ట్రీస్ అనే హ్యాష్ ట్యాగ్ తో వరుస ట్వీట్లు చేసింది కంగనా.