ప్రజంట్ టాలీవుడ్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ ఇకటి. హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాలో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి బయటకు వస్తున్న ఒక్కో అప్ డేట్, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రాన్ని రూ.100 కోట్లకి పైగా బడ్డెట్‌తో తెరకెక్కించారు. ఇక ప్రమోషన్ పనులు కూడా మొదలెట్టిన మూవీ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది..
Also Read : Mollywood : స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌పై..మేనేజర్ పోలీసు కేస్
తాజా సమాచారం ప్రకారం ‘కన్నప్ప’ చిత్రంలో కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డ్రైవ్ తిసుకుని ఆఫీస్ బాయ్ రఘు పారిపోయాడు. అతని పై పోలీస్‌లకి ఫిర్యాదు చేశారు ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయకుమార్. సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను, ఫిల్మ్ నగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు, డీటీడీసీ కొరియర్ ద్వారా పంపింది ముంబాయి హెచ్ఐవీఈ స్టూడియోస్. ఆ పార్సిల్‌ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుంచి వారిద్దరూ కనిపించడంలేదని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ తెలిపింది. కొంతమంది పెద్ద వాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
