Sandiyar First Look: లోకనాయకుడు కమల్ హాసన్ స్క్రీన్‌పై కనిపిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులోకి పరకాయ ప్రవేశం చేసే యూనివర్సల్ హీరో తాజాగా రిలీజైన తన కొత్త సినిమా ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ‘సేతుపతి’, ‘చిత్తా’ లాంటి పవర్ ఫుల్ ఎమోషనల్ హిట్లను తీసిన డైరెక్టర్ ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ప్రాజెక్ట్‌కు ‘సండియార్’ (#Sandiyar) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బయటకు వదిలారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కమల్ హాసన్ లుక్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డం, ట్రిమ్ చేసిన హెయిర్, డార్క్ బ్రౌన్ షర్ట్ వేసుకుని చాలా రఫ్ అండ్ రా అవతారంలో దర్శనమిచ్చారు. పాతకాలపు కారు డోర్ మీద చేయి పెట్టి, రివాల్వర్‌ను పట్టుకుని ఆయన తీక్షణమైన చూపులు థియేటర్లలో విధ్వంసం ఖాయమని చెప్పకనే చెబుతున్నాయి. దీనికితోడు కారు డోర్‌పై నుంచి కారుతున్న రక్తపు మరకలు సినిమా ఏ రేంజ్ రా యాక్షన్‌తో సాగనుందో క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ‘సండియార్’ అంటే దేనికీ వెరవని, ఎవరికీ తలవంచని మొండి ధైర్యం కలవాడని అర్థం. ఆ టైటిల్‌కు తగ్గట్టే కమల్ బాడీ లాంగ్వేజ్ భీకరంగా కనిపిస్తోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకూరుస్తున్నారు. ప్రశాంతంగా కనిపిస్తూనే లోపల అగ్నిపర్వతంలా రగిలిపోయే ‘సండియార్’ పాత్రతో కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి.
SANDIYAR
சண்டியர் 🔥#KamalHaasan #SUArunkumar
#Sandiyar #சண்டியர்
#SandiyarSambavam #HappyBirthdayKamalHaasan #HBDKamalHaasan #CelebratingKamalHaasan
@ikamalhaasan #Mahendran @anirudhofficial @anbariv #SunilKS @amritharam2 #CSBalachandar @AKunjamma @RohanShrestha @RKFI @turmericmediaTM @magizhmandram @APIfilms @homescreenent
— Raaj Kamal Films International (@RKFI) November 6, 2026

