Site icon NTV Telugu

ట్రెండింగ్ లో “పుష్పక విమానం” సాంగ్

Kalyanam Lyrical Song is Trending at 2 on Youtube

ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో నాయికలుగా గీతా సైని, శాన్వి మేఘన నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్‌ దేవరకొండ సమర్పకుడు కాగా అతని తండ్రి గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ రుషి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులు రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని పని చేస్తున్నారు. ఈ సినిమాలోని “కళ్యాణం” అనే లిరికల్ సాంగ్ ను ఈ నెల 18న సమంత అక్కినేని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. యూట్యూబ్ లో 2వ స్థానంలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుండడం విశేషం. పెళ్ళి నేపథ్యంలో సాగుతున్న ఈ సాంగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సిద్ శ్రీరామ్ ఈ సాంగ్ ను ఆలపించగా… మంగ్లీ, మోహన భోగరాజు, దివ్య మాలిక, హరిప్రియ కోరస్ అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ‘దొరసాని’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలో ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రూపొందుతున్న ‘పుష్పక విమానం’ ఆనంద్ కు ఎలాంటి ఫలితాలు తెచ్చిపెడుతుందో చూడాలి మరి.

Exit mobile version