NTV Telugu Site icon

Kalki 2898 AD: కల్కి ఆగమనం.. ఓటీటీలో చూసేయండిక!

Kalki

Kalki

Kalki 2898 AD Streaming in Amazon Prime Video and Netflix: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్విని దత్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, పశుపతి, అన్న బెన్, శోభన వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చింది. మొదటి ఆట నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Imanvi: ఏంటి బాసూ… మొదటి సినిమాకే అంత ఇచ్చేస్తున్నారా?

ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అలాగే హిందీ భాష మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. సంతోష్ నారాయణ సంగీతం అందించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా నాగ అశ్విన్ ఆలోచనలను తెరమీద చూడటం ఆసక్తికరంగా ఉందని అందరూ చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా థియేటర్లలో మిస్సయిన వారు ఉంటే ఓటీటీలో చూసేయండి. లేదా థియేటర్లలో చూసినవారు కూడా మరోసారి ఆ కల్కి వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు మరోసారి చూసి చూసేయొచ్చు అంటూ సినిమా టీం తాజాగా ప్రకటించింది.

Show comments