NTV Telugu Site icon

ఆహాలో టొవినో థామ‌స్ ‘కాలా’

స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు అనువాద చిత్రాలకూ ఇప్పుడు ఆహా అడ్డాగా మారిపోయింది. మరీ ముఖ్యంగా మలయాళంలోని మోస్ట్ వాంటెడ్ మూవీస్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో భాగంగానే టొవినో థామస్ నటించిన అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది. ఈ యేడాది మార్చి 25న ‘కాలా’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే భావోద్వేగ సంఘటనల సమాహారమే ‘కాలా’. టొవినో థామస్ తో పాటు సుమేష్ మూర్, దివ్యా పిళ్ళై, లాల్ పాల్, ప్రమోద్ వెల్లియానంద్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రోహిత్ వి.ఎస్. దర్శకత్వం వహించాడు. గతంలో ఆహాలో ప్రసారమైన ‘మూతాన్, జల్లికట్టు, మిడ్ నైట్ మర్డర్స్, వ్యూహం, నిఫా వైరస్, షైలక్’ తరహాలోనే ‘కాలా’కు వీక్షకుల ఆదరణ లభిస్తుందనే ఆశాభావాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. అలానే ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ఆహా ఒరిజినల్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ కూడా ప్రసారం కానుంది.