Site icon NTV Telugu

kajal : ఆ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్..?

Kajal

Kajal

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో, అద్భుతమైన విజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ..  కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషలోను దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. తన నటన అందంతో ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక పోతే కాజల్ కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అయితే తాజాగా ఈ అమ్మడు, కింగ్ నాగార్జున సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది..

Also Read : Ilayaraja : భారత రక్షణ శాఖ‌కు విరాళం అందించిన ఇళయరాజా..

ఏంటీ అంటే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైనా నాగార్జున ఇంకా కాజల్ కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. నాగార్జున నటించిన ‘రగడ’ అనే మూవీ చూసే ఉంటారు. ఇందులో అనుష్క, ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. అయితే మొదట ఈ మూవీ‌లోని ప్రియమణి పాత్రకు కాజల్‌ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను కాకుండా ప్రియమణిని తీసుకున్నారట. ఇక నాగార్జున హీరోగా రూపొందిన ‘ది ఘోస్ట్’ మూవీ లో కూడా మొదట కాజల్‌ను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ అది కుదరకపోవడంతో ఆ సినిమాలో సోనాల్ చౌహాన్ ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇలా రెండు సార్లు నాగార్జున తో నటించే అవకాశాన్ని కాజల్ మిస్ అయినట్లు తెలుస్తోంది.

Exit mobile version