Site icon NTV Telugu

Kagitham Padavalu: ఆసక్తి రేకెత్తిస్తున్న కాగితం పడవలు ట్రైలర్

Kagitham

Kagitham

ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.

”ప్రేమ నిప్పులాంటిది. అది రెండు జీవితాలకు వెలుగునిచ్చే దీపం అవ్వచ్చు.. లేదా అడవిని దహించే కార్చిచ్చుగా మారొచ్చు”అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రేమకథలోని డెప్త్ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది. లీడ్ పెయిర్ వర్ధన్, కృష్ణప్రియ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంది. స్క్రీన్‌పై వారి ఎమోషన్స్ హార్ట్ టచింగ్ వున్నాయి. ఎంజీఆర్ తుకారాం టేకింగ్ అద్భుతంగా వుంది. విజువల్స్, నేపధ్య సంగీతం అన్నీ గ్రాండ్ గా వున్నాయి ఎమోషన్స్, యాక్షన్, హృదయాన్ని తాకే ప్రేమ కథ తో ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీ పెంచింది. ఈ చిత్రానికి AIS.నౌఫల్ రాజామ్యూజిక్ అందిస్తున్నారు. రుద్రసాయి డీవోపీగా పని చేస్తున్నారు, జెస్విన్ ప్రభు ఎడిటర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.హిమ బిందు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version