Site icon NTV Telugu

Kaantha: మొదటి రోజు కలెక్షన్స్..బానే రాబట్టిందే!

Kaantha

Kaantha

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూనే, రానాతో కలిసి నిర్మించిన తాజా చిత్రం, ‘కాంత’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈ సినిమాని సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. ఆయనకు దర్శకుడిగా ఇది మొదటి చిత్రం. ప్రమోషన్స్‌లోనే అందరి చూపు ఈ సినిమా మీద పడేలా చూసుకుంది సినిమా యూనిట్. ఇక ఈ క్రమంలోనే, తాజాగా ఈ సినిమా రిలీజ్ అయింది. నవంబర్ 14వ తేదీన సినిమా రిలీజ్ అవ్వగా, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. తెలుగులో, తమిళంలో అయితే రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు.

Also Read :Prabhas : అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో ప్రభాస్ సై అంటే సై

ఇక మొత్తంగా చూసుకుంటే, ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి ఏకంగా ఈ సినిమాకి 10 కోట్ల 36 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక హీరో, మరో దర్శకుడి మధ్య వచ్చే ఈగో వార్ ఎలాంటి పరిణామాలకు తీసింది అనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ సినిమా రూపొందించారు. సినిమా రిలీజ్ అవ్వకముందు, తమిళంలో సూపర్ స్టార్‌గా ఉన్న త్యాగరాజ భాగవతార్ అనే వ్యక్తి బయోపిక్ అనే ప్రచారం జరిగింది, కానీ తర్వాత అది నిజం కాదని తేల్చారు. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం, ఇది కేవలం కల్పిత కథ అనే విషయం అర్థమైంది. మొత్తంగా చూసుకుంటే, ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 10 కోట్ల 36 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టడం గమనార్హం.

Exit mobile version