Site icon NTV Telugu

Junior Review : జూనియర్ ఓవర్సీస్ రివ్యూ

Junior Review

Junior Review

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్‌’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  నేడు విడుదల కాబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది.

Also Read : Kothapallilo Okappudu : కొత్తపల్లిలో ఒకప్పుడు.. ప్రీమియర్ టాక్..

ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. అందుకే తగ్గట్టే ఈ సినిమాలోని కథ, కథనాలు కూడా అప్పటి లానే ఉంటాయి. ఒక్కగానొక్క కొడుకుని బొమ్మరిల్లు ఫాదర్ లా పెంచుతుంటే అది తట్టుకోలేని కొడుకు కాలేజీలో చేరి అమ్మాయి వెనకాల పడడం అక్కడ కొన్ని గొడవలు, అది చూసి హీరోయిన్ సదరు హీరోకి పడిపోడంవ, కాలేజీ అయ్యాక జాబ్ లో జాయిన్ అయితే అక్కడ లేడి బాస్ కి హీరోకి మధ్య ఇగోలు, చివరికి ఆ లేడి బాస్ కి ఇబ్బంది వస్తే హీరో సపోర్ట్ చేయడం సింపుల్ గా చెప్పాలంటే ఇదే కథ. ఎన్నో తెలుగు సినిమాలలో విన్నట్టు వుండే కథ చూసిపుడు కూడా ఎక్కడో చూసినట్టు ఉందే అనిపించేలా  ఉంటుంది. భోజనాలలో విస్తరిలా అన్ని మిక్స్ చేసి తీసిన రెగ్యులర్ టెంప్లెట్ లో ఉంది. అయితే హీరోగా చేసిన కిరీటి నటన, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా చేసాడు. డాన్స్ లు అయితే జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ను అనుకరించి అదరగొట్టాడు. బహుశా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కావడంతో యాక్టింగ్ లో కూడా ఆయనని అనుకరించినట్టు అనిపిస్తుంది. శ్రీలీల ఉందంటే ఉంది అంతే. దేవిశ్రీ నేపధ్య సంగీతం బాగుంది. తొలి సినిమాకే మంచి పర్ఫామెన్స్ చేసిన కిరీటి మంచి కథలు పడితే స్టార్ గా ఎదుగుతాడనడంఓ సందేహమే లేదు. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే జూనియర్ కు వెరీ యావరేజ్ మార్కులే తెచ్చుకున్నాడు.

Exit mobile version