జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దాదాపుగా డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్లే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ జిమ్ ట్రైనర్ ఒక వీడియో తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి దేవర నుంచి వర వరకు వర నుంచి విక్రం వరకు అలాగే ఇప్పుడు డ్రాగన్ కోసం అంటూ జూనియర్ ఎన్టీఆర్ జిమ్ వర్కౌట్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు.
Also Read:Telusu Kada: ‘తెలుసు కదా’ ముగించేసిన సిద్దు
ఈ మనిషి తన డెడికేషన్ తో నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ వర్క్ ఔట్స్ చేస్తూ తన కండలతో పాటు ప్యాక్‌ల తిరిగిన తన దేహాన్ని చూపిస్తున్నాడు. మొత్తం మీద ప్రశాంత్ నీల్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడుతున్నాడని విషయాన్ని తన జిమ్ ట్రైనర్ షేర్ చేసిన ఒక్క వీడియోతో క్లారిటీ వచ్చినట్లుంది.
