NTV Telugu Site icon

Jr NTR: నాకోసం ఎవరూ పాదయాత్ర చేయొద్దు.. నేనే మీ అందరినీ కలుస్తా!

Ntr

Ntr

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు.

Thief: సినీ నటితో ప్రేమలో పడిన దొంగ.. ఏకంగా రూ. 3 కోట్లతో ఇల్లు..

ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేసారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.