DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్

Dtttmovie

Dtttmovie

మలయాళ వెర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా Don'tTroubleTheTrouble. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలాఉండగా ఈ వేడుకకు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ యుంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరుకానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో అభిమానుల్లోనూ చిత్ర యూనిట్‌లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించే ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌కు రానుండటంతో గ్రాండ్ హంగామా మొదలైంది. ఎన్టీఆర్ ఈవెంట్ కు వస్తుండడంతో ఎంట్రీ పాస్ ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. చాలా రోజుల తర్వాత జూనియర్ సినిమా ఈవెంట్ కు వస్తుండడంతో అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ మరియు షోయింగ్ బిజినెస్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. బాలయ్య పవర్ఫుల్  డైలాగ్ నే టైటిల్ గా పెట్టుకుని వసున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఎలాంటి సంచలనం చేస్తుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.