NTV Telugu Site icon

Nunakkhuzhi: తెలుగులోకి జయ జయహే హీరో సినిమా.. ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి చూడాలంటే?

Nunakkhuzhi

Nunakkhuzhi

Jeethu Joseph’s Laugh Riot ‘Nunakkhuzhi’ to Stream in Telugu: మలయాళంలో జీతూ జోసెఫ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే ఈ మధ్య బసిల్ జోసెఫ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జీతూ జోసెఫ్ దర్శకుడిగా, బసిల్ జోసెఫ్ హీరోగా వచ్చిన ‘నూనక్కళి’ సినిమాకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రాబోతోంది. సెప్టెంబర్ 13న ఈ చిత్రం జీ5లో మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎదురయ్యే అనూహ్య మలుపులు, నవ్వులతో అందంగా మలచిన చిత్రం నూనక్కళి.

Raghu Thatha: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్ ‘రఘు తాత’.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

‘ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అతి తక్కువ దూరం నవ్వు’ అని, ఈ సినిమాతో కుటుంబ సభ్యులు ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. బసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఓనమ్ పండుగ సమయంలో విడుదలవుతుండటంతో వీక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆస్వాదించగలరని ఆశిస్తున్నాము. బసిల్ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘రోజువారీ మలయాళీ యువతను ప్రతిధ్వనించే పాత్రలను పోషించేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటా – నూనక్కళితో మరోసారి అలాంటి ఓ పాత్రను పోషించాను. ఇందులో నేను ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ, ఏదో ఒక చిక్కుముడి సమస్యతో ఉంటా, థియేటర్లలో మాకు ఆడియెన్స్ మంచి విజయాన్ని అందించారు. ఇక ఇప్పుడు మా చిత్రం ZEE5లో ప్రీమియర్ అవుతున్నందుకు సంతోషిస్తున్నాను’ అని అన్నారు.

Show comments