Allu Arjun: అల్లు అర్జున్ నువ్వు హీరో కాదు కమెడియన్.. జనసేన గన్నవరం ఇంఛార్జ్ సంచలనం

  • అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్
  • చిరంజీవి-పవన్ కళ్యాణ్- నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు
  • వారిని విమర్శించే స్థాయి నీకు లేదు
  • చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో మహావృక్షం లాంటివాడు: జనసేన పార్టీ గన్నవరం సమన్వయకర్త
Chalamasetty Ramesh Allu Ar

Chalamasetty Ramesh Allu Ar

Janasena Gannavaram Leader Chalamalasetty Ramesh Babu Sensational Comments on Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన పార్టీ గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు అనుచిత వ్యాఖలు చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో రమేష్ బాబు హీరో అల్లు అర్జున్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా చలమలశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా? కమెడియన్ మాత్రమే, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు, వారిని విమర్శించే స్థాయి నీకు లేదు అని అన్నారు.

Vikram: బ్లాక్ బస్టర్ తంగలాన్.. టీం అందరికీ స్వయంగా బిర్యానీ వడ్డించిన విక్రమ్

×
×
Ad

చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో మహావృక్షం లాంటివాడు, ఎన్నో సంఘ సేవలు, బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు చిరంజీవి, నువ్వు నీడ నిచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావని అన్నారు. నీ బాబు అల్లు అరవింద్ నువ్వు పిల్లికి బిక్షం కూడా పెట్టలేనటువంటివాళ్లు మీరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ స్థాయి ఏమిటో నువ్వేమిటో ముందు చూసుకో, నువ్వు తొందరలో చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదని అన్నారు. డిసెంబర్ నెలలో నీ సినిమా రిలీజ్ అయ్యి మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూపిస్తా, నీ ఫ్లెక్సీలు కట్టే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ లేరని ఆయన అన్నారు.