అనూహ్యంగా అల్లు అర్జున్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన రాక కారణంగా సంధ్య ధియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ అంశం మీద ఆయన ట్వీట్ చేశారు. తనకు కోమాలో ఉన్న శ్రీతేజ్ ను చూడాలనుకున్న సరే లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా తనను అక్కడికి వెళ్ళవద్దని చెప్పినట్లు వెల్లడించాడు. అతని గురించి తాను ప్రార్థిస్తున్నానని మాట ఇచ్చినట్లుగా ఆ కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని తాను వీలైనంత త్వరలో ఆ బాలుడిని కలవాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేశాడు. అయితే ఈ విషయం మీద జనసేనలో యాక్టివ్ గా ఉండే బొలిశెట్టి సత్యనారాయణ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అర్జున్ గారు ఆ యాక్సిడెంట్ లో ఇబ్బంది పడిన కుటుంబాన్ని బాధ్యతగా తీసుకోండి.
Manchu Family: మంచు కథా చిత్రమ్.. పోలీసులకు ఫిర్యాదు చేయనున్న మనోజ్
మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది ఆకాశమే మీ హద్దు. జనాన్ని మీరు ఇన్స్పైర్ చేయండి అలాగే మీ మీద జనం ఉంచిన నమ్మకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లండి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తాను విశాఖపట్నంలో ఉన్న మీ తాత గారి స్నేహితులలో ఒకరినని అంటూ ఆయన కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ ట్వీట్లో జనసేన ను పవన్ కళ్యాణ్ను కూడా ట్యాగ్ చేయడం గమనార్హం. నిజానికి గత కొంతకాలం నుంచి జనసేనకు అల్లు అర్జున్కి గ్యాప్ వచ్చింది అని కూడా ప్రచారం ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు అంటూ నంద్యాల శిల్పా రవి నివాసానికి వెళ్లారు. తన సొంత మామ పవన్ కళ్యాణ్ జనసేన పక్కన పెట్టి వైసీపీ నేతకు సపోర్ట్ చేయడం మీద అప్పటినుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అయితే నిన్న మెగాస్టార్ నివాసానికి నాగబాబు నివాసానికి బన్నీ స్వయంగా వెళ్లడంతో మెగా అభిమానులు కాస్త మెత్తబడ్డారని చెప్పవచ్చు.