ఈ ఏడాది ‘సుల్తాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. అయితే తెలుగునాట ‘సుల్తాన్’ కి ఆదరణ దక్కలేదు. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే కార్తీ ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లోనూ, పి.యస్. మిత్రన్ తో ‘సర్దార్’ సినిమాలోనూ నటిస్తున్నాడు. తాజాగా ‘సర్దార్’లో కార్తీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. పూర్తి గడ్డంతో రఫ్ గా కనిపించే కార్తీ లుక్ సినిమాపై అంచనాలు పెంచిందనే చెప్పాలి. ఈ సినిమా కోసం భారీ సెంట్రల్ జైలు సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపనున్నారు. ఈ జైలు సన్నివేశాలు సినిమాకు ఆయువు పట్టుగా ఉంటాయట. ‘ఖైదీ’ తరహాలో కార్తీ మరింత మాస్ గా కనిపిస్తాడట. ఈ మూవీకి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కార్తీకి జోడీగా రాశిఖన్నా నటిస్తోంది.
కార్తీ ‘సర్దార్’ కోసం జైలు సెట్
