NTV Telugu Site icon

“జగమే తందిరం” ట్రైలర్ రిలీజ్ డేట్

Jagame Thandhiram trailer arrives on 1st June

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన “జగమే తందిరం” చిత్రం ఓటిటిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్ ను ప్రకటించారు నిర్మాతలు. జూన్ 1న “జగమే తందిరం” ట్రైలర్ విడుదల కానుందని ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “జగమే తందిరం” 2020లో విడుదల కావాల్సి ఉంది కాని కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. వై నాట్ స్టూడియోస్‌ పై శశికాంత్ నిర్మించిన “జగమే తందిరం”లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ నటుడు జేమ్స్ కాస్మో, సంచన నటరాజన్, ఐశ్వర్య లెక్ష్మి, జోజు జార్జ్, కలైరసన్, వడివక్కరసి కీలకపాత్రల్లో నటించారు. గత ఏడాది థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం థియేటర్ల మూసివేత కారణంగా ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది.