Site icon NTV Telugu

జూన్ 18న ఓటిటి లో ధనుష్ ‘జగమే తందిరం’

Jagame Thandhiram from June 18 on Netflixindia

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ సురులి అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ‘జగమే తందిరం’ చిత్రం థియేటర్లోనే విడుదల అవుతుందని గతంలో చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ధనుష్ అభిమానులు కూడా ఈ సినిమా విడుదల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి అత్యంత్య వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ఈ సినిమాను ఓటిటి వేదికపై విడుదల చేయడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. ఈ మేరకు జూన్ 18న ‘జగమే తందిరం’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా ధనుష్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ధనుష్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘ఆత్రంగి రే’ షూటింగ్ పూర్తయ్యింది. మరోవైపు కార్తీక్ నరేన్ సినిమాతో పాటు హాలీవుడ్ సినిమా ‘ద గ్రే మ్యాన్’ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంకా ఇటీవల విడుదలైన ‘కర్ణన్’ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ధనుష్‌. కరోనా సమయంలోనూ ‘కర్ణన్’ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Exit mobile version