స్టార్ డైరెక్టర్ ఇటీవల పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ ఇంట ఐటి రైడ్స్ జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్న పలువురు నిర్మాతల ఇళ్లపై ఐటి రైడ్స్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి శంకర్ లను ప్రశ్నించారు. ఇక పుష్ప 2 సినిమా డైరెక్ట్ చేసినందుకు సుకుమార్ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వసూళ్లకు తగ్గట్టు ఐటీ చెల్లింపులు జరగలేదని ఐటీ నిర్ధారించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను ప్రస్తుతానికి అధికారులు తనిఖీ చేస్తున్నారు. మరో పక్క మరో నిర్మాత నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల భారీ వసూళ్లు సాధించిన సినిమాల నిర్మాతలను టార్గెట్ చేసింది ఐటీ శాఖ.
RGV: బిగ్గెస్ట్ ఎవర్ సినిమా “సిండికేట్” చేస్తున్నా
వచ్చిన వసూళ్లకు, చెల్లించిన పనులకు వ్యత్యాసం చాలా ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పుష్ప 2 సినిమాలో సుకుమార్ కి షేర్స్ ఉన్నట్లుగా ఐటి అధికారులు గుర్తించారు. దీంతో ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సుకుమార్ ని అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు వెంటనే కొండాపూర్ లో ఉన్న సుకుమార్ నివాసానికి తీసుకువెళ్లి ఆయన సమక్షంలోనే సోదాలు జరుగుతున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత దీనిపై ఐటి అధికారులు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయి అందరి అంచనాలను అందుకుని సినిమా ఇప్పటికే 1800 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసింది. 2000 కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. ఇలాంటి సమయంలో సుకుమార్ నివాసం సహా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల నివాసాలపై సోదాలు చేయడం హాట్ టాపిక్ అవుతాం.