అల్లు అర్జున్ తాజాగా బ్రహ్మానందం పిక్స్ ఉన్న టీ షర్ట్ ధరించి వార్తల్లోకి ఎక్కాడు. ఈ విషయం గురించి ఒక టాలీవుడ్ జర్నలిస్ట్ బన్నీకి వార్తల్లో ఉండడం ఎలాగో బాగా తెలుసు అంటూ ఒక ట్వీట్ వేశారు. దానికి స్పందించిన బన్నీ వాసు ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్..? ఆయన వేసుకున్న టీ షర్టు మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా..? అక్కడ తన అభిమాన హాస్యనటుడు పై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా..?
Also Read : Peddi : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీ లీల.. ఏకంగా మెగా హీరోతో !
మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేసిన పాజిటివ్ కోణం మీకు కనబడలేదు కానీ, అందులో ఇలాంటి అర్థం లేని లాజిక్ మాత్రం ఒకటి వెతికారు. వీలైతే గొడవలు ఆపుదాం.. మంచి విషయాలను పాజిటివ్ గా చెబుదాం. నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి గారు అంటూ జాతీయ వేదికపై నిన్ననే బన్నీ గారు చాలా బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్ లో రాలేదనుకుంటా.. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటిని హైలెట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇటువంటివి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు సార్..? అంటూ ట్వీట్ చేశారు. దానికి సదరు జర్నలిస్టు కూడా స్పందిస్తూ నేను నెగిటివ్ సెన్స్ లో చెప్పలేదు… అని సవినయంగా విన్నవించు కుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు.
