NTV Telugu Site icon

Devara : ‘దేవర’ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడనుందా..?

Whatsapp Image 2024 05 09 At 7.50.36 Am

Whatsapp Image 2024 05 09 At 7.50.36 Am

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా  ఏప్రిల్‍ 5న దేవర మూవీని రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడుతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ప్రస్తుతం దేవర రిలీజ్ ప్లాన్‍ లో  మార్పులు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.ఈ సినిమాను వారం లేదా రెండు వారాలు ముందుగానే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.దీనితో ఈ సినిమా షూటింగ్ పనులను త్వరత్వరగా జరిపేందుకు మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తుంది .బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో వచ్చే హైవోల్టేజ్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉండనున్నట్లు సమాచారం.