Site icon NTV Telugu

నిఖిల్ సిగరెట్ కాలుస్తూ ఇలా…!

Intense pre-look of Nikhil from 18Pages

యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “18 పేజెస్”. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 1న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్. అయితే ఆరోజు దగ్గర్లోనే ఉండడంతో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ రోజుకో సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు ఈ చిత్రం నుంచి ఒక వైపు చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకొని, మరోవైపు ఒక వ్యక్తి పేజీలో వ్రాస్తున్నట్లు ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ సిగరెట్ కాలుస్తూ కాగితం తగలబెట్టడం కనిపిస్తుంది. దానిపై జూన్ 1న ఫస్ట్ లుక్ అని రాసి ఉంది. దీంతో “18 పేజెస్” ఫస్ట్ లుక్ విడుదల గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

Exit mobile version