Site icon NTV Telugu

“పుష్ప” అప్డేట్ : ఫస్ట్ సింగిల్ డేట్ ప్రకటించిన మేకర్స్

That action episode in Pushpa will be the major highlight!

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప” మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు. ‘డాక్కో డాక్కో మేకా’ అనే పాటను 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్)లో పాడారు. యాదృచ్ఛికంగా “ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ ను కూడా 5 భాషల్లో ఐదుగురు సింగర్స్ పాడారు. ఫస్ట్ సింగిల్ “దాక్కో దాక్కో మేక” అనే పేరుతో విడుదల కానుంది. అల్లు అర్జున్ మీద చిత్రీకరించబడింది ఈ సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉండేలా కన్పిస్తోంది. అంతేకాకుండా ఈ సాంగ్ లో మాస్ బీట్స్ తో పాటు అద్భుతమైన కొరియోగ్రఫీని కూడా చూడవచ్చని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన “దాక్కో దాక్కో మేక” సాంగ్ ఆగస్టు 13న విడుదల కానుంది.

Read Also : “రాక్షసుడు-2” కోసం షాకింగ్ బడ్జెట్

దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబో 12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తోంది. మరి అంచనాలు మామూలుగా ఉంటాయా ? ఇక “పుష్ప”లో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తుండగా… రష్మిక మందన్న హీరోయిన్ గా గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్‌లపై “పుష్ప”ను నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్ స్కోర్ చేస్తున్నారు.

Exit mobile version