పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరి హర వీరమల్లు. ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎ.ఎం. రత్నం నిర్మించారు. ఈ నెల 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ మాట్లాడుతూ “ఏ ఎం రత్నం ఎన్ని సమస్యలోచ్చినా మౌనం గా ఉంటారు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఆ మౌనమే ఈ రోజు నన్ను రోడ్డు మీదకు తీసచ్చేలా చేసింది ఆయన ఒక మంచి సినిమా తీశారు అని చెప్పడానికే వచ్చాను. AP FDC చైర్మన్ గా AM రత్నం పేరు ప్రతిపాదించా. సినిమా పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. పొలిటికల్ గా నాకు ఎంత పేరున్నా. ఇతర హీరోలతో పోల్చితే నాకు అంత బిజినెస్ ఉండకపోవచ్చు. దానికి కారణం నా దృష్టి అంతా సొసైటీ వైపు, పాలిటిక్స్ వైపు ఉండడం. చాలా మంది హీరోల్లో నేను ఒక హీరోను అంతే. సంవత్సరంలో నా సినిమాకు ఒక రోజు ఉంటుంది అంతే. మనమంతా కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో కొట్టుకుంటాం. కానీ సినిమాకు ఈ వివక్షలేవీ ఉండవు. చిరంజీవి కొడుకు అయినా, తమ్ముడైనా, ఎవ్వరైనా మనకు సత్తా లేకుంటే ఇండస్ట్రీలో నిలబడలేం. అలాంటి ఇండస్ట్రీలోకి కొత్తవాళ్లు రావాలి. వాళ్ళందరి కోసం ఏ ఎం రత్నం లాంటి వాళ్ళు ఉండాలి. ఆయనకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని నేను వచ్చాను అని అన్నారు.
Also Read : Pawan Kalyan : నేను యాక్సిడెంటల్ యాక్టర్ ని.. ఈ మీడియా మీట్ ఎందుకు పెట్టానంటే?
