Site icon NTV Telugu

Pawan Kalyan : నేను యాక్సిడెంటల్ యాక్టర్ ని.. ఈ మీడియా మీట్ ఎందుకు పెట్టానంటే?

Hhvm (4)

Hhvm (4)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరి హర వీరమల్లు.  ఎ.ఎం. రత్నం పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ నెల 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఫ్యాన్స్ భారీ  అంచనాలు పెట్టుకున్నారు. రిలీజ్ దగ్గరపడుతున్న నేపధ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు పవన్.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ అందరికి నమస్కారం. పోడియం లేకుండా మాట్లాడుతుంటే నగ్నంగా ఉన్నట్టు ఉంది. ఈ మధ్య కాలంలో నేను మీడియా మీట్ నిర్వహించి ఎన్నాళ్ళు అవుతుందో గుర్తు లేదు. పొలిటికల్ ప్రెస్ మీట్స్ లో పాల్గొన్నాను కానీ సినిమా మీడియాతో మట్లాడడమా ఇదే తొలిసారి. నేను సినిమా మీట్స్ లో మాట్లాడానికి నేను మొహమాటపడుతాను. నేను చాల యాక్సిడెంటల్ యాక్టర్ ని. గత్యంతరం లేక సినిమాలలోకి వచ్చా. కానీ ఈ రోజు ప్రెస్ మీట్ ను కేవలం మా నిర్మాత ఏ ఎం రత్నం కోసం పెట్టాను. సాయంత్రం ఈవెంట్ ఉన్న కూడా ఇప్పడు ఎందుకు వచ్చానంటే మళ్ళి మీడియాతో మాట్లాడే టైమ్ దొరకకపోవచ్చు. ముఖ్యంగా రీజనల్ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెల్లిన వారు ఏ ఎం రత్నం. సినిమా ఇండస్ట్రీ ఎబిలిటీ పెంచిన వ్యక్తి రత్నం. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. నేను పాలిటిక్స్ వలన సినిమాకు దూరంగా వెళ్లిన కూడా నేను మళ్ళి సినిమా చేయాలనీ రత్నం అడిగినపుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత ఈ సినిమా కోసం ఇచ్చాను’ నేను ఉన్న పరిస్థితుల్లో సినిమా కోసం టైమ్ ఇవ్వాలేను అలాంటిది ఈ సినిమా క్లైమాక్స్ కోసం 57 రోజులు ఇచ్చాను. నా వంతుగా ఎంత చేయాలో అంత సపోర్ట్ ఇచ్చాను’ అని అన్నారు.

Also Read : HHVM : హరిహర రిలీజ్ చిక్కులు.. చక్రం తిప్పిన ముగ్గురు నిర్మాతలు

Exit mobile version