NTV Telugu Site icon

రణబీర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న దీపికా!

I actually caught Ranbir red-handed: Deepika Padukone

కొన్ని ప్రేమలు పెళ్ళిపీటల వరకూ ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నలకు కాస్తంత ఆలస్యంగా సమాధానాలు లభిస్తుంటాయి. గతంలో దీపికా పదుకునే, రణబీర్ కపూర్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. చాలా కాలం డేటింగ్ చేశారు. అతి త్వరలో పెళ్ళి చేసుకుంటారనగా, ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యానికి లోను చేస్తూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. దానికి కారణాలు ఏమిటనేది అప్పట్లో తెలియలేదు. ఆ తర్వాత దీపికా పదుకునే మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను పెళ్ళి చేసుకుంది. అయితే… ఒకానొక సమయంలో రణబీర్ కపూర్ తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని, అందుకే అతనికి దూరమయ్యానని దీపికా తెలిపింది. లవ్, సెక్స్, రిలేషన్ షిప్ విషయంలో తనకంటూ కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయని దీపికా చెబుతోంది. సెక్స్ అంటే కేవలం శారీరకమైనది మాత్రమే కాదని, అది భావోద్వేగాలతో మిళితమైనదని అంటోంది. తన వరకూ తాను ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నా నిజాయితీగా ఉన్నానని, అలా ఉండలేని పక్షంలో ఒంటరిగా ఉండటమే మేలని భావిస్తానని దీపిక తెలిపింది. అయితే అందరూ అలా ఆలోచించరని, అందువల్లే తాను గతంలో హర్ట్ అయ్యానని ఒప్పుకుంది. ఇదిలా ఉంటే… మంగళవారం దీపికా పదుకునే తల్లిదండ్రులతో పాటుగా ఆమెకూ కరోనా సోకింది. ప్రస్తుతం వైద్యుల సలహాలూ సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక సొంత బ్యానర్ లో ఆ మధ్య ‘చపాక్’ మూవీని ప్రొడ్యూస్ చేసిన దీపిక, ఇప్పుడు హాలీవుడ్ మూవీ ‘ది ఇంటర్న్’ను హిందీలో రీమేక్ చేస్తోంది. వర్క్ ప్లేస్ లోని వ్యక్తుల మధ్య ఏర్పడే సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. దీపికా పదుకొనేతో పాటు ఇందులో కీలక పాత్రకు తొలుత రిషి కపూర్ ను అనుకున్నారు. కానీ ఆయన చనిపోవడంతో ఇప్పుడా పాత్రను అమితాబ్ పోషించబోతున్నారు. గతంలో అమితాబ్, దీపికా కాంబినేషన్ లో వచ్చిన ‘పీకు’ను ఇది మరిపిస్తుందేమో చూడాలి.