Site icon NTV Telugu

Sritej: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

Sritej

Sritej

ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. బాలుడు తీవ్రంగా గాయపడి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Pranaya Godari: ఎలాంటి రివ్యూలు ఇస్తారో అని అనుకున్నాం: ‘ప్రణయ గోదారి’ దర్శకుడు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఇక శ్రీతేజ్ వైటల్స్ అన్నీ కొద్దిగా నిలకడగా ఉన్నాయని అంటున్నారు. ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాడు అని, అప్పుడప్పుడు ఫీవర్ ఉంటోంది అని తెలుస్తోంది. పూర్తిగా స్పృహలో అయితే లేడు, అప్పుడప్పుడు ఫిట్స్ లాంటి కదలికలు ఉన్నాయని, ప్రత్యేకంగా శ్రీతేజ్ ను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.

Exit mobile version