యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 లో నాచురల్ స్టార్ నాని హీరోగా కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం పక్కింటి అబ్బాయిలా ఉండే నానిని మోస్ట్ వైలెంట్ గా చూపించడం వంటి అంశాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
నేడు ప్రీమియర్స్ తో విడుదల అవుతున్న హిట్ 3 నార్త్ అమెరికాలో తన వేట మొదలుపెట్టింది. సాధారణంగా నాని సినిమాలకు యూఎస్ మార్కెట్ లో ఎంత స్ట్రాంగ్ గా వసూళ్లు ఉంటాయి. గతంలో నాని నటించిన అనేక సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్ లో 400K డాలర్స్ దిశగా దూసుకెళుతోంది. ఇక టికెట్స్ పరంగా చూస్తే 18,000+ కేవలం యుఎస్ ప్రీమియర్స్ రూపంలో రాబట్టింది. అటు UKలోను నాని చెలగాటం అడిస్తున్నాడు. ఇప్పటికే అక్కడ 8500 టికెట్స్ పైగా బుకింగ్స్ తో సాలిడ్ స్టార్ట్ అందుకుంది హిట్ 3. USA లో నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ ప్రీమియర్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మరో వైపు నాని కెరీర్ లోనే హిట్ 3 ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతుంది. మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతున్న హిట్ 3 సూపర్ హిట్ టాక్ వస్తే భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.
