జీ5 ఓటీటీ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా రానుంది. అదే ‘హిసాబ్ బరాబర్’. విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా నీల్ నితిన్, కీర్తి కుల్హారి ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు. జీ5లో జనవరి 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రీమియర్‌కు సిద్ధమైందీ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే.. ఓ బ్యాంక్ చేసే చిన్న పొరపాటు ఓ వ్యక్తి జీవితాన్ని తలక్రిందులు చేస్తే ..అతనెలా స్పందించాడు? న్యాయం కోసం అతను ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్థికపరమైన మోసం, అవినీతి, న్యాయం కోసం చేసే పోరాటం ఇవన్నీకథలో భాగంగా మిళితమై ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. విలక్షణ నటుడు ఆర్.మాధవన్, నీల్ నితిన్,కీర్తి కుల్హారి తదితరులు వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు.
Samantha: సమంతకి అస్వస్థత.. ఏమైందంటే?
ప్రేక్షకులు మెచ్చేలా చక్కటి డ్రామా, కామెడీ, సామాజిక అంశాలతో.. అశ్విన్ ధీర్ దర్శకత్వంలో జియో స్టూడియోస్, ఎస్పి సినీకార్ప్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో చిరు ఉద్యోగి అయిన రాధే మోహన్ శర్మ పాత్రలో మాధవన్ మనకు ఇందులో కనిపిస్తారు. ఆయన ఓసారి తన బ్యాంక్ ఖాతాలో చిన్న తేడాని గుర్తించి బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తాడు. దాని గురించి ఆరా తీయగా అదొక పెద్ద ఆర్థికమైన మోసమని తెలుస్తుంది. దాని చుట్టు ఉన్న మోసం, అవినీతి వంటి వాటిని సదరు టికెట్ కలెక్టర్ గుర్తిస్తాడు. ఈ క్రమంలో తను ఆ బ్యాంక్ హెడ్ మిక్కీ మెహతా (నీల్ నితిన్) వంటి పెద్ద వ్యక్తితో పోరాటం చేయాల్సి వస్తుంది. ఊహించని మలుపులతో సాగే ఈ కథలో రాధే మోహన్ అనే సామాన్యుడు అవినీతితో వ్యవస్థీకృతమైన సమస్య నుంచి ఎలా ఎదుర్కొంటాడు.. దాన్నుంచి సురక్షితంగా ఎలా బయట పడతాడు? అనే విషయాలు అందరినీ ఆలోచింప చేస్తాయి.