హీరో అంటే కెమెరా ముందు.. డైరెక్టర్ అంటే కెమెరా వెనుక కానీ ఇప్పుడు ఆ రూల్‌నే మార్చేస్తున్నారు కొందరు హీరోలు, దర్శకులు. అసలు ఇది క్రియేటివ్ ప్యాషనా.. లేక తమ కెరీర్‌లో వచ్చిన ఫ్లాప్స్, ఇమేజ్ ప్రెజర్ నుంచి బయటపడేందుకు కొత్త రూట్ వెతుక్కోవడమా. హీరోగా హిట్ కొట్టలేకపోతే డైరెక్టర్‌గా మారడం, డైరెక్టర్‌గా గ్యాప్ వస్తే హీరోగా మారడం, ఇది ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌గా మారుతోంది.
ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఇప్పుడు డైరెక్షన్ వైపు ఫోకస్ పెట్టాడు. హీరోగా తనకు సరైన కథ దొరకడం లేదా? లేక తనే కథ చెప్పాలని అనుకుంటున్నాడో కానీ, డైరెక్టర్‌గా మారాడు..‘ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.. అందుకే తానే కథ రాసుకుని, తన డైరెక్షన్‌లోనే హీరోగా నటించడం సేఫ్ అని రామ్ భావించాడేమో.. అందుకే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు కూడా.ఇక కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా మారుతున్నాడు. అలాగే తరుణ్ భాస్కర్… డైరెక్టర్‌గా ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ చేసిన తర్వాత హీరోగానూ నటిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అన్నీ మనమే చేద్దాం” అనే ఫేజ్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. హీరోగా ఉండటం ఒక జాబ్.. డైరెక్టర్‌గా ఉండటం మరో జాబ్. రెండింటినీ ఒకేసారి చేయడానికి టాలెంట్‌తో పాటు టైమ్ కంట్రోల్, టీమ్ మేనేజ్‌మెంట్ కూడా కావాలి. హీరోలు డైరెక్టర్స్ అవుతున్నా… డైరెక్టర్స్ హీరోలవుతున్నా బాక్సాఫీస్ మాత్రం ఎవరి క్రియేటివ్ ఎక్స్‌పెరిమెంట్‌నూ ఎమోషన్‌తో చూడదు రిజల్ట్ మాత్రమే చూస్తుంది.

