Site icon NTV Telugu

Akhanda 2 Release Date: ఎల్లుండి తమ్ముడు పవన్‌ సినిమా.. అఖండ 2 వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన బాలయ్య..

Akhanda2

Akhanda2

Akhanda 2 Release Date: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమా విడుదలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే, నటసింహ నంమూరి బాలకృష్ణ.. తన తాజా మూవీ అఖండ 2 విడుదలపై కూడా క్లారిటీ ఇచ్చారు.. అసెంబ్లీ లాబీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్‌చాట్ చేశారు నందమూరి బాలకృష్ణ.. అయితే, అఖండ-2 విడుదల ఎప్పుడు అంటూ బాలయ్యను అడిగారు మంత్రులు, ఎమ్మెల్యేలు.. దీనిపై స్పందించిన బాలకృష్ణ ఎల్లుండి (సెప్టెంబర్‌ 25) తమ్ముడు పవన్‌ కల్యాణ్ ఓజీ సినిమా విడుదలవుతోంది.. అఖండ-2 డిసెంబర్‌ 5న విడుదలవుతోందని పేర్కొన్నారు.. పాన్‌ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో అఖండ 2 సినిమాను తీసుకొస్తున్నాం. హిందీ డబ్బింగ్‌ కూడా చాలా బాగా వచ్చిందని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారని తెలిపారు.. అంతేకాదు, అన్ని భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు.. అయితే, ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల అభివృద్ధికి కృషిచేద్దాం అని పిలుపునిచ్చారు నందమూరి బాలకృష్ణ.. ఇక, జిల్లాకు ప్రత్యేక నిధులు అడుగుదామని మంత్రి సవిత అనగ.. రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతోందన్నారు నందమూరి బాలకృష్ణ.

Read Also: West Bengal: భర్తలకు విడాకులిచ్చి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు..

కాగా, ‘అఖండ’ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోన్న విషయం విదితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇక, తమన్ సంగీతం అందిస్తుంగా.. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 25వ తేదీన సినిమాని విడుదల చేయాలని మొదట్లో నిర్ణయించినా.. రీరికార్డింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ ఉండడంతో.. సినిమా విడుదలని వాయిదా వేస్తూ గతంలో వాయిదా వేశారు.. ఇప్పుడు అఖండ-2 డిసెంబర్ 5న విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ..

Exit mobile version