Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న “సెహరి” పెప్పీ టైటిల్ సాంగ్

Here's the Enjoyable Jolly Number Sehari Title Song

హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. ఈ చిత్రాన్ని కన్య పిక్చర్స్ నిర్మిస్తోంది. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దాదాపు నెల క్రితం ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి “సెహరి” టైటిల్ సాంగ్ కు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. రామ్ మిరియాలా డైనమిక్ గా పాడిన ఈ అద్భుతమైన పెప్పీ ట్రాక్ కు యష్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Exit mobile version