NTV Telugu Site icon

Harish Shankar: మీతో మరో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నా.. విశ్వప్రసాద్ కి హరీష్ శంకర్ ట్వీట్

Harish Shankar

Harish Shankar

Harish Shankar Responds to TG Vishwa prasad Tweet: ఉదయం మంచి హరీష్ శంకర్ మీద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడంటూ పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం మీద విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాను అన్న మాటలను ఇంకాస్త పెద్దవిగా చేసి రాశారని హరీష్ శంకర్ విషయంలో తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని అని చెప్పుకొచ్చాడు. అంతే కాక హరీష్ శంకర్ సినిమా మేకింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని మరో సినిమా ఆయనతో కలిసి చేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చాడు. ఇక ఇదే ట్వీట్ కి హరీష్ శంకర్ స్పందించాడు.

Pawan Kalyan: మా దేవుడు నువ్వేనయ్యా.. పవన్ ఫోటోకి పూజలు చేసి నాట్లు!

మీ సపోర్ట్ గురించి నాకు తెలుసు సార్. అయితే మీరు అన్నారు అన్నట్టుగా రాస్తున్న వార్తలు చూసిన తర్వాత ఒక్క నిమిషం కూడా మీరు ఆ మాటలు అని ఉంటారు అని నేను అనుకోలేదు. మీతో కలిసి చేయబోయే తర్వాతి సినిమా సెట్స్ లో మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను. అలాగే మరొక సక్సెస్ఫుల్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. అన్ని విషయాల్లో మీరు ఇచ్చిన మద్దతుకి థాంక్స్ సర్ అంటూ ఆయన తన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా అంత బాడ్ సినిమా కాదని కానీ హరీష్ శంకర్ ప్రమోషన్స్ లో మీడియా మీద అటాకింగ్ మోడ్ లో ఉండడం వల్ల అనేక ఫ్యాక్టర్ల ప్రోద్బలంతో సినిమా మీద నెగెటివిటీ చాలా పెరిగిపోయింది అని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. దీంతో హరీష్ శంకర్ వల్లే సినిమా ఇంత దారుణంగా తయారయింది అని ఆయన అన్నట్టుగా మీడియాలో ప్రచారం జరిగింది.

Show comments