NTV Telugu Site icon

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు : డబుల్ ట్రీట్… ఒకాదాని తరువాత ఒకటి…!!

Hari Hara Veeramallu Teaser Release Update

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా “హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు” మూవీ తెర‌కెక్క‌బోతోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను ఎ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గ నటిస్తోంది. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ మూవీకి సంబంధించిన అనేక కీల‌క స‌న్నివేశాల‌ను హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలోని సెట్స్ వేసి తీస్తున్నారు. దానికి తోడు ఇది పిరియాడిక‌ల్ డ్రామా కావ‌డంతో పోర్ట్ సెట్స్ ను గ్రాఫిక్ తో డిజైన్ చేయ‌బోతున్నారు. ఇక తాజా అప్డేట్ ఏంటంటే… “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” నుంచి ఒకదాని తరువాత ఒకటి డబుల్ ట్రీట్ ఉండబోతోందట. పవన్ పుట్టినరోజు, సెప్టెంబర్ 2న టీజర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆగష్టు 12న నిధి అగర్వాల్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారట. ఈ వార్త పవన్ అభిమానుల్లో హుషారు నింపేస్తోంది. కాగా ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్… కరోనా ఎఫెక్ట్ తగ్గగానే రీస్టార్ట్ కానుంది.