కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. గత యేడాది కరోనా క్రైసిస్ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు సినీ పెద్దలు నిత్యావసరాలను అందించారు. అప్పుడు వసూలు అయిన విరాళలలో కొంత మొత్తం ఇంక ఈ ఛారిటీ సంస్థలో ఉంది. దాంతో చిరంజీవి ఆ మొత్తాన్ని వాక్సినేషన్ కు ఉపయోగించాలని భావించారు. గురువారం నుండి 45 సంవత్సరాల పైబడిన సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్ నేతృత్వంలో మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసై చిరంజీవిని అభినందించారు. అందుకు గానూ సీసీసీ తరఫున చిరంజీవి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమ మద్దత్తుతోనే ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు.
చిరంజీవికి గవర్నర్ ప్రశంసలు
