NTV Telugu Site icon

SS Rajamouli: ఏళ్ళ నుంచి ఫోన్లో వాల్ పేపర్.. రాజమౌళి కాళ్లపై పడ్డ నిర్మాత

Ss Rajamouli

Ss Rajamouli

సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి కాళ్ళ మీద ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా పడటం హాట్ టాపిక్ అయింది. ముందుగా రాజమౌళి మాట్లాడుతూ తాను కొంచెం పని ఉండడంతో వెళ్ళిపోతున్నానని చెప్పారు. అయితే సూర్య మైక్ తీసుకుని తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని, కాబట్టి సిగ్గు లేకుండా చెబుతున్నాను అదే స్టేషన్లో ఉన్నాను త్వరగానే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నానని రాజమౌళితో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరిచాడు. ఆ తర్వాత మీరు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అన్నారు అది మీ మంచితనం. కానీ మీరు ఎప్పుడో ఒక ఎవరెస్ట్ లాంటి శిఖరాన్ని చేరుకున్నారు. అక్కడికి వెళ్లేందుకు దారి కూడా చూపించారు.

Hyderabad: పసికందు కిడ్నాప్‌కు యత్నం.. మహిళ అరెస్ట్

మేము మీ బాహుబలి పేరు ఉచ్చరించడానికి కూడా అర్హులమో కాదో తెలియదు. మీరు వేసిన దారిలోనే మేము మీ వెనుక నడుస్తూ వస్తున్నాము, మీరు మా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి షేక్ హ్యాండ్ ఇస్తే అదే మాకు పెద్ద ఆస్కార్ లాంటిది అని పేర్కొన్నారు. అంతేకాక జ్ఞానవేల్ రాజా తనకు పరిచయమైనప్పటినుంచి మీ ఫోటోనే తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాడని కూడా చెప్పారు. దీంతో జ్ఞానవేల్ రాజా పైకి వచ్చి తన ఫోన్లో ఉన్న రాజమౌళి ఫోటో చూపించడమే గాక రాజమౌళి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సూర్య హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.

Show comments