Site icon NTV Telugu

కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమౌతున్న సూపర్ స్టార్ మనవరాలు

Girl from Rajkumar family enters films as leading lady

ఉత్తరాదిన స్టార్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల కుమార్తెలు నట వారసులుగా చిత్రసీమలోకి అడుగుపెట్టడం బాగా ఉంది. కానీ దక్షిణాదిన అది తక్కువ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రసీమల్లో తండ్రి అడుగుజాడల్లో సినిమాలలోకి వచ్చిన కుమార్తెలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. అయితే… కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మనవరాలు ఇప్పుడు చిత్రసీమలోకి అడుగు పెడుతోంది. ఆమె నటించిన తొలి కన్నడ చిత్రం ‘నిన్న సనిహాకే’ ఆగస్ట్ లో విడుదల కాబోతోంది.

Read Also : వాలీబాల్ ఆడుతున్న యంగ్ టైగర్… వీడియో వైరల్

స్వర్గీయ రాజ్ కుమార్, పార్వతమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. కొడుకులు శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్. ఈ ముగ్గురు సినిమా హీరోలుగా సుపరిచితులే. ఇక కుమార్తెలు ఇద్దరు. లక్ష్మీ, పూర్ణిమ. రెండో అమ్మాయి పూర్ణిమ నటుడు, నిర్మాత రాజ్ కుమార్ ను వివాహమాడింది. వానికి ధన్య, ధీరేన్ ఇద్దరు పిల్లలు. ఇప్పుడు ధన్య… తన తాతయ్య, మేనమామల అడుగు జాడల్లో నడుస్తూ హీరోయిన్ గా రాణించబోతోంది. విశేషం ఏమంటే… కన్నడ చిత్రం విడుదలకు సిద్ధమౌతున్న సమయంలోనే ధన్య కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంది. తమిళ చిత్రసీమలోనూ నటిగా తన సత్తాను చాటాలని భావిస్తోంది. ఏ సంస్థ ఆమెతో సినిమా నిర్మిస్తుందో ఇంకా ప్రకటించకపోయినా గ్రౌండ్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కన్నడ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య సైతం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ పై దృష్టి పెట్టి సినిమా నటిగా రాణించే ప్రయత్నం చేస్తోంది.

Exit mobile version