అనుష్క హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెండేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ అయినా కూడా ఆచి తూచి సినిమాలు చేస్తోంది అనుష్క. భాగమతి ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అవుతోంది.
Also Read : Naga Vamsi : నాగవంశీపై నెగిటివ్ కామెంట్స్ కు ఇచ్చిపడేసిన వెంకీ అట్లూరి
ఈ సినిమా ఇన్ సైడ్ గురించి టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అందిన సమాచారం ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ రోలర్ కోస్టర్ గా సాగుతుంది, హై-ఆక్టేన్ రైల్వే స్టేషన్ సన్నివేశం, గుహలో సాగే ఫైట్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇస్తుంది. ఇక ఇంటర్వెల్ ప్రేక్షకులకు సూపర్ ట్విస్ట్ ఇస్తుంది. కానీ స్టోరీ పరంగా స్లో గా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో కథ యొక్క ప్రధాన భాగం ప్రారంభమవుతుంది. బాధితురాలి నుండి నేరస్థురాలిగా, పురాణగాథగా మారిన శీలవతి అనే మహిళగా అనుష్క ఛేంజోవర్ ఆడియెన్స్ కు గూస్ బంప్ కలిగించేలా ఉంటాయి. ఫైనల్ గా స్వీటీ నుండి సూపర్ సినిమా చూశామని ఫీలింగ్ తో ప్రేక్షకులు థియేటర్ల నుండి బయటకు వస్తారని తెలుస్తోంది. భావోద్వేగాలతో కూడిన కథ యాక్షన్ మరియు కెరీర్‌ను స్వీట్ అద్భుతమైన నటనతో ఘాటి హిట్ సినిమాగా నిలుస్తుందని టాక్. క్వీన్ అనుష్కశెట్టిని వేదం లో చూపించిన దానికి బిన్నంగా స్వీటీ అంటే స్వీట్ కాదని కత్తి పట్టి వీరవిహారం చూపించిన విధానం మెప్పిస్తుందని సమాచారం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది, U/A సర్టిఫికేట్ తో 2 గంటల 37 నిమిషాల నిడివితో మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానుంది ఘాటీ.
