Site icon NTV Telugu

భారీ రేటుకు “గని” శాటిలైట్ రైట్స్… ఆ ఓటిటికే సొంతం…!

Ghani Satellite and Digital rights bagged by Aha

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘గని’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది. వరుణ్ కెరీర్‌లో మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం బాక్సింగ్ లో బాగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అంతేకాదు తన పాత్రకు తగినట్లుగా తన శరీరాన్ని మార్చుకున్నాడు. దానికోసం జిమ్ లో బాగానే చెమటను చిందించాల్సి వచ్చింది. ఇక టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల ‘గని’ కూడా ముందున్నాడు. ఈ చిత్రం హక్కులను పొందటానికి చాలా మంది డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజాలు ఇప్పటికే మేకర్స్‌తో చర్చలు జరిపారు.

Read Also : సుస్వర మహర్షి మంగళంపల్లి బాల మురళీకృష్ణ

తాజా అప్డేట్ ప్రకారం తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ‘గని’ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను భారీ అమౌంట్ చెల్లించి సొంతం చేసుకుందట. ఈ చిత్రం రైట్స్ ను ‘ఆహా’ 24 కోట్లకు కొనుగోలు చేసింది. వరుణ్ తేజ్ పాన్-ఇండియా చిత్రానికి ఇది భారీ భారీ మొత్తమనే చెప్పాలి. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి అల్లు బాబీ, సిద్ధూ ముద్దా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఇందులో సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version