NTV Telugu Site icon

Ghaati : ఫస్ట్ లుక్ తో బయపెడుతున్న ‘అనుష్క’

Anushkashetty

Anushkashetty

క్వీన్ అనుష్క శెట్టి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో కలిసి ఘాటీ (GAATI ) కొత్త ప్రాజెక్ట్ కోసం మరోసారి జతకట్టారు.  UV క్రియేషన్స్ సమర్పణలో మరియు రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన బ్లాక్ బస్టర్ ‘వేదం’  విజయం తర్వాత అనుష్క మరియు క్రిష్ కలయికలో వస్తున్నా ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా.

Also Read : Suriya : కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావట్లేదు..

నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు, పోస్టర్ అద్భుతమైన మరియు క్రూరమైన అవతార్‌ లో కనిపిస్తుంది. పోస్టర్‌లో అనుష్క తల మరియు చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది, అయితే గంభీరమైన  లుక్ తో పాటు అనుష్క బోల్డ్ రూపాన్ని తెలియజేసేలా డిజైన్ చేసారు.  అలాగే నుదిటిపై బిందీతో మరియు బంగా పొగ త్రాగుతు ఆమె కన్నీటి  చుక్కలు మరియు ముక్కుపుడకలు ధరించి  ఉంగరాలు తొడిగి  సినిమాలో అనుష్క పాత్రపై మరిన్ని అంచనాలు పెంచేలా చేస్తోంది.  విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌తో, ఘాతీ విలక్షణమైన కథనంతో రానుంది ఈ సినిమా. ఘాటీ ఒక గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రదర్శించబడుతోంది, క్రిష్ అనుష్కను అధిక-ఆక్టేన్, యాక్షన్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు ఘాతీ గ్లిమ్స్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Also Read : Nithin : సాయి పల్లవితో సినిమాలో డాన్స్ చేయాలి.. అది నాకు గ్రేట్ చాలెంజ్.

రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఘాటీ  సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. అధిక బడ్జెట్ మరియు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఘాతీ ప్రస్తుతం షూటింగ్  చివరి దశలో ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Show comments